kameswarichangalavala
Monday, October 22, 2012
Friday, June 29, 2012
Kameswari Changalavala Kitchen Queen
తిరిగి రాని బంగారు బాల్యం
కల్లా కపటం తెలీని చిన్న వయసు లో ఎంత ఆనందం |
నాకు వేసవి సెలవు లలో ఏ వీధి చూసినా ఎంతో ఆనందం |
ఎందుకంటే ఎక్కడ చూసినా, పిల్లలు గుంపులు గుంపులుగా, కనిపిస్తుంటారు.
మాములప్పుడు కనిపించని ఉల్లాసం, సంతోషం, ఉత్సాహం, వాళ్ళల్లో ఉరకలు వేస్తూ, పరిసరాలని ప్రభావితం చేస్తాయి. ఈ చదువుల పోటిలు , అటు పేరెంట్స్ కి, ఇటు పిల్లలకి, ప్రశాంతతని పోగొట్టేసాయి.
రెక్కలు ముక్కలు చేసుకుని, సంపాదించిన సొమ్ముతో, పిల్లల 'భవితవ్యాన్ని' కొంటున్న పేరెంట్స్ కష్టానికి, సార్ధకత చేకూర్చే ప్రయత్నంలో, పిల్లలు చాలా టెన్షన్ పడుతున్నారు.
సెలవులలో కూడా, ఇంట్లో చదివేందుకు, ప్రత్యేకమైన సిలబస్ ఇచ్చి ,అప్పుడు కూడా పిల్లలని, పేరెంట్స్ ని, 'ఫ్రీ' గా వదలని, హైటేక్ స్కూల్స్ ఎన్నో| పిల్లలకి ఏదో కాసేపు, ఆటవిడుపుగా, టీవీ, కంప్యూటర్ గేమ్స్, స్విమ్మింగ్, సినిమాలు, వంటి వి తప్ప 'ఆటలు' అంటేతెలియవు, ఇవన్ని లేనప్పుడు, మునుపటి తరం వాళ్ళు ఆడిన ఆటలు తెలియవు, వినోదాన్ని డబ్బుతో కొనుక్కోడం, ఎవరో కనిపెట్టిన గేమ్స్ వీడియోస్ లో చూడటం, ఆడటమే తప్ప,రకరకాల ఆటలతో, వారిలోని సృజనాత్మకతను, మెరుగు పరుచుకునే ఆటలేమి తెలీదు,
ఇప్పటి పిల్లలు టీవీ లలో, వీడియోస్ లో,
చూపించినవి చూస్తూ, వినిపించినవి వింటూ, మెదడు కి స్వంత ఆలోచన అన్నది లేకుండా, ఎదుగుతున్నారు. లోగడ అయితే ,మగపిల్లలు బిళ్ళంగోడు, బొంగరాలు, 7 స్టోన్స్, దాగుడు మూతలు, కబాడీ, క్రికెట్, కోకో, వీరి వీరి గుమ్మడిపండు, బాడ్మింటన్, లాంటివెన్నో ఆడేవారు,(క్రికెట్ టెన్నిస్) ఇప్పుడు కూడా అడుతున్నారు.
ఆడపిల్లలు అయితే, తొక్కుడు బిళ్ళ, చింత గింజలాట,గచ్చ కాయలు , చెమ్మ చెక్క, లాంటి ఆటలు ఆడేవారు. పరుగు పందేలు, కోతికోమ్మచి, ఒప్పుల కుప్ప,చాకలిబాన , సరేసరి |ఈ రోజుల్లో ఈ ఆటలేమిటి? అనుకోవచ్చు. కానీ శారీరక శ్రమ తో కూడిన, ఆటలు ఆడితే, వారికీ ఒంటికి వ్యాయామం తో పాటు, మంచి ఆకలి, అరుగుదల, ఆటలలో నేర్పు ,వాటిల్లో గెలవాలన్న పట్టుదల, వంటివి అలవడి బుద్ధి వికసిస్తుంది .
ఇప్పటి పిల్లలకి 'హైపర్ అక్టివిటి' ఎక్కువ | పేరెంట్స్ కి టెన్షన్ తగ్గాలంటే, ఇలాంటివన్నీఆడిస్తే, వాళ్ళు మాములుగా అవడమే కాక, 'ఒబేసిటీ' బాధ కూడా వుండదు. ఇదివరకు ఉమ్మడి కుటుంబాలు కాబట్టి, ఇంట్లోనీ, పినతల్లి పెత్తల్లి పిల్లలు. చిన్నాన్నపెదనాన్న పిల్లల తో,వాళ్ళే ఆడేవారు. ఇపుడు పరిమిత కుటుంబాలు కాబట్టి, ఇవన్ని చూసుకోవాల్సిన బాద్యత కూడా, పేరెంట్స్ మీదే పడుతోంది.
సెక్యూరిటీ కూడా పెద్ద సమస్య అయింది ఈ రోజుల్లో| కొంతలో కొంత 'గేటెడ్ కమ్యూనిటి' లో వుండే పిల్లల గురించి, టెన్షన్ వుండదు. అలా కాకుండా, విడిగా వుండేవారు, పిల్లలని కొందర్ని గ్రూపులుగా చేర్చి, వారికి ఇటువంటి ఆటలు, కనీసం ఆదివారాలు, సెలవులలో నేర్పించి అడిస్తుంటే, బాగుంటుంది.
ఏది ఎలా వున్నా, ఇప్పుడు పిల్లలని ఆరోగ్యవంతంగా, సక్రమంగా పెంచాలంటే, తల్లితండ్రులకి, 'కత్తి మీద సాము' లాంటిదే | అయినా తప్పదు కదా| పిల్లలని కంటికి రెప్పలా కాపాడుకోవాలి .
సన్నజాజి తీవేలోయ్ సంపంగి పూవులోయ్
చిలిపి చిన్నారులోయ్ పాపలు సిరులోలికే చిన్నారులోయ్
దాగుడు మూతా లాడితే సూర్యుడే మెచ్చేను
చేమ్మచేక్కలాడితే చందా మామే వచ్చెను
Subscribe to:
Posts (Atom)